- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికలు ముగియగానే ఆపని మొదలుపెడతాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో:100 రోజుల కాంగ్రెస్ పరిపాలన తనకు సంపూర్ణ సంతృప్తి ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు కావొస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ మూడు నెలల పరిపాలనలో ప్రభుత్వానికి సహకరించిన తెలంగాణ సమాజానికి సహచర మంత్రులకు, ఉద్యోగులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో, ఆరు గ్యారెంటీల హామీలతో ఎన్నికల్లో ప్రజాతీర్పును కోరామన్నారు. ప్రజల ఆమోదంతో డిసెంబర్ 7న రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన మొదలైందని, ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలనే తపనతోనే పని చేస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు. గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముడులు వేస్తే వాటన్నింటిన ఒక్కొక్కటిగా విప్పుతున్నామన్నారు. ఈ వందరోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని భావించడం లేదుని, ఇంకా పెండింగ్ లో ఉన్న హామీలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా పని చేస్తామ్ననారు. తెలంగాణ అభివృద్ధి కోసం 2050 పేరుతో ఓ మెగా మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఈ విషయంలో సంప్రదింపులు ప్రారంభిస్తామని ప్రకటించారు.