పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.. ఆధైర్యపడొద్దు: మంత్రి జూపల్లి కృష్ణారావు

by Shiva |
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.. ఆధైర్యపడొద్దు: మంత్రి జూపల్లి కృష్ణారావు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆకాల వర్షాలు, వడగళ్ల కారణంగా పంట నష్టాపోయిన రైతులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని.. ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన నిజామాబాద్ జిల్లాలోని సిరికొండల మండల పరిధిలోని కొండూరు, వాల్గోట్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు నష్ట పరిహారం అందజేస్తామని తెలిపారు. రైతులు ఆదుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసిందని ఆరోపించారు. కనీసం విత్తనాలపై సబ్బిడీ కూడ ఇవ్వలేదని ధ్వజమెత్తారు.

ధరణిలో జరిగిన అక్రమాల చిట్టా తమ దగ్గర ఉందని, ధరిణిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. వర్షాల కారణంగా అన్నదాతలు తమ పంటలను కోల్పోయిన కనీసం చూసేందుకు రాలేదని ఆరోపించారు. వచ్చే పంట కాలానికి ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేయిస్తామని అన్నారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చేస్తామని అన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed