- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ రైతు డిక్లరేషన్ నిజం చేశాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ను నిజం చేశామన్నారు. రైతులకు సంపూర్ణమైన సహకారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉన్నదన్నారు. రుణమాఫీ కార్యక్రమ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేసిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులంతా అత్యధిక సంతోషంలో ఉన్నారన్నాని తెలిపారు.
రూ.2 లక్షల రుణ మాఫీ హామీ ఇచ్చినప్పుడు అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతుల గుండెల్లో నిలిచిపోయారని సీఎంను కొనియాడారు. నల్గొండ నియోజకవర్గంలో 8,358 ఖాతాల ద్వారా 7,890 కుటుంబాలకు రుణమాఫీ జరిగిందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.46.16 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. నల్గొండ జిల్లాలో 83,121 ఖాతాల ద్వారా 78,757 కుటుంబాలు రుణమాఫీ పొందగా, వీటి కోసం రూ. 481.63 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు కలిగిన దాదాపు11 కోట్ల కుటుంబాలకి 11.50 లక్షల ఖాతాల ద్వారా రూ.6,098 కోట్లు జమ చేశామన్నారు.