- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajashekhar: చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం దయచేసి పట్టించుకోండి.. రాజశేఖర్ ఆవేదన
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఒకప్పుడు వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తన కూతుర్లను కూడా ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కానీ కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన నిర్మాణం చేస్తున్నట్లు సమాచారం. రాజశేఖర్ చివరిసారిగా నటించిన సినిమా ఎక్స్‌ట్రార్డినరీ. మూవీస్ చేయనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. తాజాగా, జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ విజయలక్ష్మి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు.
ట్విట్టర్ వేదికగా పోస్ట్ కూడా చేశాడు. ‘‘జీహెచ్ఎంసీ రోడ్ నెంబర్ 70 లో అశ్విని హైట్స్ వద్ద ఎప్పటి నుంచో డ్రైనేజీ లీక్ అవుతుంది. మేము ఎప్పుటినుంచో పరిష్కరించాలని ఆన్‌లైన్ ద్వారా అడుగుతున్నాము. అయినప్పటికీ దాన్ని ఇంకా పరిష్కరించడానికి ఎవరూ రాకపోవడంతో ఇది ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం దయచేసి పట్టించుకోండి. వెంటనే దానిని పరిశీలించి సమస్యను పరిష్కరించండి’’ అని రాసుకొచ్చాడు. అలాగే జీహెచ్ఎంసీ కమీషనర్, మేయర్ విజయలక్ష్మిని ట్యాగ్ చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశాడు. అంతేకాకుండా డ్రైనేజీ లీక్ అవుతున్న ఫొటోను కూడా షేర్ చేయడంతో.. ప్రజెంట్ రాజశేఖర్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
- Tags
- Rajashekhar