- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24/7 ప్రజా సేవకు కట్టుబడి ఉన్నాం!.. కేటీఆర్ ట్వీట్ కు తెలంగాణ పోలీస్ రిప్లై
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఘటనలో బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, అధికారి బదిలీ అయ్యారని తెలంగాణ పోలీస్ తెలిపింది. లారీ డ్రైవర్ పై ట్రాఫిక్ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ఇది ఆమోదయోగ్యమైన ప్రవర్తనేనా? అని పోస్ట్ చేశారు. దీనికి ట్విట్టర్ వేదికగా తెలంగాణ పోలీస్ రిప్లే ఇచ్చింది. ట్వీట్ లో ఈ ఘటన సైబరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ లిమిట్స్ పరిధిలో చోటుచేసుకుందని, బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఆ స్టేషన్ పరిధి నుండి బదిలీ అయ్యారని స్పష్టం చేశారు. అలాగే మేము 24/7 ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని ఎక్స్ లో తెలంగాణ పోలీస్ రాసుకొచ్చింది.
కాగా ఈ ఘటనపై కేటీఆర్.. ఇది ఎంతటి చెత్త భాష నో తెలంగాణ డీజీపీకి అర్ధం అవుతోందా? అని, ఇది ఆమోదయోగ్యమైన ప్రవర్తనా? అని ప్రశ్నించారు. అలాగే పోలీసు సిబ్బంది, అధికారులకు జీతాలు చెల్లించేది పౌరులేనని దయచేసి గుర్తుంచుకోవాలని అన్నారు. నా ట్వీట్ కేవలం ఒక సంఘటన గురించి మాత్రమే కాదని, పౌరులతో పోలీసులు అత్యంత అనుచితంగా ప్రవర్తిస్తున్న అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూస్తున్నానని తెలిపారు. ఇక పౌరులతో ప్రత్యక్ష సంబంధంలో ఉండే పోలీసుల ప్రవర్తనను మార్చేందుకు మీరు సెన్సిటైజేషన్ తరగతులు నిర్వహిస్తారని ఆశిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.