- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇచ్చేది రూ.5 వేలు.. పని 24 గంటలు!
దిశ, తెలంగాణ బ్యూరో : ‘మన ఊరు- మన బడి’ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 1982 పాఠశాలల్లో 90% మేర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగా స్కూళ్లలో ఉన్న ఫర్నీచర్, కంప్యూటర్లు, విలువైన సామాగ్రి, మౌలిక సదుపాయాలను కాపాడేందుకు గాను వేసవి సెలవుల్లో డే అండ్ నైట్ వాచ్‌మెన్‌లను నియమించాలని రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నియామకాలు చేపట్టాలని హెడ్‌మాస్టర్లకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు గాను వాచ్‌మెన్‌కు ప్రతి నెలా గౌరవ వేతనం పేరుతో రూ.5000 ఇవ్వాలని నిర్ణయించారు.
సవాల్‌గా నియామకం..
ఈ ఉద్యోగంలో మాజీ సైనికులకు ప్రియారిటీ ఇవ్వాలని డైరెక్టర్ సూచించారు. అలాంటి వ్యక్తులు దొరకని పక్షంలో గ్రామంలో అందుబాటులో ఉన్న వ్యక్తిని నియమించాలని సూచించారు. ఈ బాధ్యతను పాఠశాల హెడ్‌మాస్టర్‌కు కట్టబెట్టారు. ఇంత తక్కువ వేతనానికి అర్హులైన వ్యక్తుల్ని వెతకడం వారికి సవాలుగా మారింది. దీనికి తోడు కేవలం రెండు నెలలు మాత్రమే ఈ కొలువు ఉంటున్నందున అంత తక్కువ కాలానికి ఎవరు దొరుకుతారు ? అనేదీ వారికి ప్రశ్నగానే మిగిలింది.
రూ.5 వేల వేతనంతో కుటుంబాన్ని పోషించేదెలా ?
సగటు మనిషి జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని కార్మికులకు రోజుకు కనీసం వేతనం, డైలీ వేజ్ లాంటివి ప్రభుత్వాలు ఫిక్స్ చేశాయి. రోజుకు రూ.350 పైబడి చెల్లిస్తూ ఇతర ప్రయోజనాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలో కనీస వేతనం ఇవ్వడం గగనంగా మారింది. ఇంత తక్కువ వేతనంతో డే అండ్ నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న వ్యక్తి తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆఫీసులు, పలు కంపెనీల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న వారికి కనీస వేతనం రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఇస్తున్నారని, ఇంతకంటే దారుణంగా వీరి వేతనం నిర్ణయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
బాక్స్ కనీస వేతన సవరణ జరగలేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కార్మికులకు కనీస వేతనాల సవరణ జరగలేదు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా జీవించడానికి కనీసం నెలకు రూ.26 వేలు అవసరం. దీర్ఘకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తున్నాం. దీనిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. పాఠశాలల్లో వాచ్‌మెన్‌లకు రూ.5000 మాత్రమే ఇస్తూ అగౌరవపరుస్తున్నది. :- భూపాల్, సీఐటీయూ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు