కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి : జడ్పీటీసీ భార్గవి సుందర్ రాంరెడ్డి

by Sumithra |
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి : జడ్పీటీసీ భార్గవి సుందర్ రాంరెడ్డి
X

దిశ, దేవరుప్పుల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నిర్మాల గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ సావిత్రి సర్పంచ్ మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రవేశపెట్టారన్నారు.

ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ ఎంపీటీసి మేడ కళ్యాణి వెంకటేష్, ఉపసర్పంచ్ అన్వర్, పాక్స్ డైరెక్టర్ జెలందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కూతటి నరసింహులు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు విద్యాసాగర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవి రాథోడ్, క్యాంపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏల అనిల్ కుమార్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story