- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంబేద్కరా ఆదుకో దాహం తీరే దారి చూపెట్టు..
దిశ, ఖిలావరంగల్ : ఓరుగల్లు అనగానే మనకు గుర్తుకు వచ్చేది పోరుగల్లే, పోరాటాల పురిటి గడ్డ ఓరుగల్లుకు నడిబొడ్డున ఉన్న ఖిలా వరంగల్ పడమరకోట ఎస్టీ కాలనీలో నీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. దాహం తీరేదారులు మూసుకుపోవడంతో మహిళలు రోడ్డెక్కారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఒక్క అధికారి కూడా అటుగా చూసిన పాపాన పోలే. కనీసం డివిజన్ కార్పొరేటర్ అయిన నీటి సమస్య తీరుస్తాడు అనుకుంటే, ఎప్పుడు అడిగినా మాట దాటవేస్తూ ఇవాళ నీళ్లు వస్తాయి, రేపు నీళ్లు వస్తాయి అని సమాధానమే తప్ప సమస్య తీరింది లేదు. ఇక చేసేదేమీ లేక అంబేద్కరుడే దారి చూపిస్తాడని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఖాళీ నీటి బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అసలే ఎండాకాలం వారానికి రెండు రోజులు కూడా సరైన సమయానికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవని ఎస్టీ కాలనీ మహిళలు, యాదవ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అందరు పడుకున్నాక అర్ధరాత్రి సమయంలో మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నారని, అవి కూడా తాగడానికి సరిపోడం లేదని మాగోడు వినేనాధుడే లేడా అని ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం అంబేద్కర్ సాక్షిగా నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా కాలనీవాసులకు సరైన సమయానికి త్రాగునీరు అందించాలని లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయంను ఖాళీ బిందెలతో కాలనీ వాసులం అందరం కలిసి ముట్టడి చేస్తామని హెచ్చరించారు.