రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం..

by Kalyani |
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం..
X

దిశ, నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న ఓ మహిళ దుర్మరణం చెందిన సంఘటన నర్సంపేట నుంచి నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారిలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఈర్యా తండాకు చెందిన రాజు అనే వ్యక్తి తన గూడ్స్ ట్రాలీ నడుపుకుంటూ నర్సంపేటకు బయలుదేరాడు. ఇదే క్రమంలో గూడూరుకు చెందిన మహిళ తన ద్విచక్రవాహనంపై నర్సంపేట నుంచి చెన్నారావుపేట వైపుగా వెళుతున్నది.

ఈ క్రమంలో చర్చి సమీపంలో గూడ్స్ ట్రాలీ స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళ తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాలీ డ్రైవర్ కు కాలు విరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో గూడ్స్ ట్రాలీ డ్రైవర్ స్పీడ్ గా నడుపుకుంటూ వెళ్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసుల విచారణ అనంతరం తేలనుంది.

Advertisement

Next Story