40 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

by Kalyani |
40 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం: ఎస్పీ శరత్ చంద్ర పవార్
X

దిశ, కొత్తగూడ: ప్రజాసేవలో ముందంజలో నడుస్తూ యువతకు క్రీడా, ఉద్యోగ శిక్షణ, వైద్య శిబిరాలు నిర్వహించి మండలంలో 40 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ షరత్ చంద్ర పవార్ అన్నారు. బుధవారం గంగారం మండలంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంత ప్రజలకు సరైనా వసతులు లేక పట్టణాలకు వెళ్లి ఆసుపత్రులలో చూయించుకోలేని వారికి ఇదొక అవకాశం అన్నారు. ఏజెన్సీ వాసుల్లో చాలా మంది ఆర్థిక స్థోమత దృష్ట్యా పొలం పనుల్లో తీరిక లేక ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించి పలు వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతున్నారన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జిల్లా స్థాయి వైద్యాధికారుల ప్రోద్భలంతో తాము మారుమూల ప్రాంతాల ప్రజలందరికీ వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటి పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల శ్రేయస్సు కొరకు అరోగ్య శిబిరాలు నిర్వహించి విజయవంతం చేసినందుకు గూడూరు సీఐ యాసిన్ ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో గంగారం మండల కో అప్షన్ మెంబర్ సయ్యద్, అడిషనల్ ఎస్పీ, అడ్మిన్ ఆపరేషన్ జే చెన్నయ్య, డీఎస్పీ రమణబాబు, సీఐలు యాసీన్, బాలాజీ, డీఎంహెచ్ఓ హరీష్ రాజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష్, వైద్య అధికారులు ప్రత్యుష, శివ ప్రసాద్, మధు, సాయినాథ్, ఎస్ఐలు సతీష్, దిలీప్, రమాదేవి, ఏఎస్ఐ శోభరాణి, ఎంపీపీ సరోజన, కోదండ రామాలయం చెర్మన్ సైపా సురేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed