చిన్నగూడూర్ మండలంలోని వడ్డెర కాలనీకి నీటి సరఫరా..

by Kalyani |
చిన్నగూడూర్ మండలంలోని వడ్డెర కాలనీకి నీటి సరఫరా..
X

దిశ, మరిపెడ (చిన్నగూడూర్ ): చిన్నగూడూరు మండల కేంద్రంలోని స్థానిక వడ్డెర కాలనీలో మంచినీటి సమస్యపై ‘దిశ’ కథనాలకు ఉన్నతాధికారులు స్పందిస్తూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇట్టి విషయం పైన ఆగ్రహించిన అడిషనల్ కలెక్టర్ ఓ అధికారికి షోకాజు నోటీసు జారీ చేసినట్టు సమాచారం. అయితే గత పది రోజుల నుంచి మంచినీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్న కాలనీ వాసుల కష్టం తీరింది.

పరిస్థితిని గ్రహించిన ఉన్నతాధికారులు ప్రత్యేకించి ఒక బావిని లీజుకు తీసుకున్నారు. కాలనీకి ఇక నుంచి నీటి కష్టాలు ఉండవని మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల ఎంపీఓ యాకయ్య మంచినీటి సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు వివరించారు. సమస్య పైన స్పందించినందుకు దిశ పత్రికకు కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Next Story