ఆర్టీసీ బస్సు ఆపి ధర్నా చేసిన గ్రామస్తులు..

by Aamani |
ఆర్టీసీ బస్సు ఆపి ధర్నా చేసిన గ్రామస్తులు..
X

దిశ, పర్వతగిరి: పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో బస్సును ఆపి గ్రామస్తులు ధర్నా చేశారు. రెగ్యులర్గా బస్సు రావూరు నుంచి రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హన్మకొండ డిపోకు చెందిన బస్సును అపి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఏడు సంవత్సరాలుగా హన్మకొండ, వరంగల్, తొర్రూర్ నర్సంపేట డిపోలో బస్సులు రావూరు గ్రామం నుండి రావాలని అన్ని డిపోల మేనేజర్లకు ఆర్టీసీ అధికారులకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్న బస్సులను రావూరు గ్రామం నుండి కాకుండా కల్లెడ పాత బ్రిడ్జి మీద నుంచి అన్నారం వైపు బస్సులను నడిపిస్తున్నారని అన్నారు.మోత్య తండా, సీత్యా తండా, ఏకే తండ, కొత్తూరు గ్రామస్తులకు రావురూ గ్రామం నుండి బస్సు సౌకర్యం ఉపయోగపడుతుందని అన్నారు.

కల్లెడ పాత బ్రిడ్జి పై నుండి నీరు ఉధృతంగా ప్రవహించడంతో బస్సులను డ్రైవర్లు రావూరు నుండి నడిపిస్తున్నారని అన్నారు. 9 కోట్ల రూపాయలు వెచ్చించి గత ప్రభుత్వం కల్లెడ గ్రామం నుండి రావూరు గ్రామానికి మధ్యలో ఆకేరు వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేయడంతో రోడ్డు వేయడం వల్ల రోడ్డు బ్రిడ్జి ఈ రోజు ఉపయోగ పడిందా అని ప్రశ్నించారు. ప్రతిరోజు ఇ రూట్ లోనే బస్సులను నడపాలని లేదంటే రావూరు గ్రామం నుండి వేరే డిపోల బస్సులు కూడా తిరగనివ్వమని గ్రామస్తులు అన్నారు.ఈ విషయాన్ని బస్సు డ్రైవర్ 100కు ఫిర్యాదు చేయగా పోలీసులు ధర్నా స్థలానికి చేరుకుని స్థానికులతో సీఐ రాజగోపాల్ తో చరవాణి లో మాట్లాడించారు. సంబంధిత డిపో మేనేజర్ లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో ధర్నా ను విరమించి బస్సును పంపించారు గ్రామస్తులు.ఈ కార్యక్రమంలో రావురు మాజీ సర్పంచ్ బండి సంతోష్, కాంగ్రెస్ నాయకులు కొమ్ము రమేష్,సతీష్,బంటి, మహిళలు చుట్టుపక్కల తండా వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story