- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
T Congress: గిరిజన బాలిక సాయిశ్రద్దకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అవుతున్న గిరిజన బాలిక(Tribal Girl) సాయిశ్రద్ద(Sai Shradha)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆర్ధిక సాయం(Financial Help) అందించారు. కుమురం భీం జిల్లా(Komuram Bhim District), జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ నీట్(NEET) లో ర్యాంక్ తెచ్చుకొని, మంచిర్యాల మెడికల్ కాలేజీ(Manchiryala Medical College)లో ఎంబీబీఎస్(MBBS)లో సీటు సాధించింది. అయితే కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక సాయిశ్రద్ద ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డ చదువుకు సాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు వేడుకున్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే డాక్టర్(Doctor) కావాలన్న ఆ అమ్మాయి కల(Dream) నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం(Telangana Govt) తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సాయిశ్రద్ద కుటుంబాన్ని పిలిపించుకొని, ఆమె చదువుకు కావాల్సిన ఆర్ధిక సాయాన్ని చెక్కు(Bank Check) రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా సాయిశ్రద్ద, ఆమె కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.