జంగాలపల్లిలో భయం.. భయం.. రెండు నెల‌ల్లో 20 మరణాలు..

by Sumithra |
జంగాలపల్లిలో భయం.. భయం.. రెండు నెల‌ల్లో 20 మరణాలు..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ములుగు జిల్లా జంగాల‌ప‌ల్లి గ్రామ‌స్తులు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. రెండు నెల‌ల కాలంలో గ్రామంలో 20 మంది అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డంతో.. ఊరి జ‌న‌మంతా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గ్రామానికి కీడు సోకింద‌ని.. ఇక్కడే ఉంటే తామూ చనిపోతామనే భయంతో కొంతమంది ఊరు విడిచి వెళ్లి పోతున్నారు.

20 మ‌ర‌ణాలు.. సేమ్ సిమ్‌టోమ్స్‌ !

సెప్టెంబ‌ర్ రెండో వారం నుంచి ఇప్పటి వ‌ర‌కు గ్రామానికి చెందిన 20 మంది చనిపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో అంద‌రూ ఒకే రకమైన వ్యాధి లక్షణాలు క‌లిగి ఉన్నారని పేర్కొంటున్నారు. అనారోగ్యానికి గురైన వారు రెండు, మూడు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నార‌ని గ్రామస్తులు చెబుతున్నారు.

పట్టించుకోని అధికారులు !

గ్రామంలో మరణాల సంఖ్య పెరిగి పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. ర‌క్త న‌మునాలు సేక‌రించి జ్వరాలు రావడానికి కారణాలు తేల్చాల‌ని విద్యావంతులు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా దెయ్యం పేరిట జ‌రుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed