- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Thummala: రాజకీయం చేయడం కోసమే బీజేపీ డ్రామాలు.. మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు (Musi Renaissance Project)కు తాము వ్యతిరేకం కాదని.. పేదల ఇళ్లను కూల్చివేస్తే సహించేది లేదని బీజేపీ (BJP) నేతలు అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతం (Musi Catchment Area)లో ఒకరోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన సవాలు బీజేపీ(BJP) నేతలు స్వీకరించారు. ఈ మేరకు 20 బస్తీల్లో 20 మంది ఆ పార్టీ ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పేదవాళ్ల మీద నుంచి బుల్డోజర్లు ఎక్కిస్తారా.. వేల ఇళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను కూల్చుతారా అని ప్రశ్నించారు.
తాజాగా, కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Minister Thummala Nageshwar Rao) కౌంటర్ ఇచ్చారు. రాజకీయం చేయడం కోసమే బీజేపీ (BJP) డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. ఒక రోజు నిద్ర చేయడం కాదు.. మూడు నెలలు నిద్ర చేస్తే నిరుపేదల బాధలు ఏంటో తెలుస్తాయని ఫైర్ అయ్యారు. 3 నెలలు బస్తీల్లోనే ఏం చేయాలో బీజేపీ (BJP) నేతలే నిర్ణయిస్తారని మంత్రి తమ్మల కామెంట్ చేశారు.