- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పత్తి రైతు పరేషాన్.. తేమ పేరుతో తిరస్కరణ..
ఆరుగాలం కష్టపడి పత్తి పండించిన రైతులు సీసీఐ తీరుతో ఆందోళన చెందుతున్నారు. తల్లాడ మండలం పరిధిలో పత్తి రైతులు సీసీఐ కేంద్రానికి పత్తిని తీసుకెళ్తే అక్కడ తేమ సాకుతో తిరస్కరిస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి వాహనాల్లో కొనుగోలుకు తీసుకెళ్తే వెనక్కి పంపుతుండటంతో కిరాయి భారమని భావించిన అన్నదాతలు దిక్కులేని పరిస్థితుల్లో పక్కనే ఉన్న ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇక ప్రైవేట్ మార్కెట్లో పత్తి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. అక్కడ వ్యాపారులు రిమోట్‌తో కాంటాను ఆపరేట్ చేస్తూ రైతులకు తెలియకుండా ఒక్కొక్క తూకంలో ఐదు నుంచి పది కిలోల తక్కువ చూపించి మోసం చేస్తున్నారు. నల్లగా మారిందనే సాకుతో క్వింటాకు రూ.1000 నుంచి రూ.2 వేలు తగ్గిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.
దిశ, తల్లాడ : సీసీఐ తీరుతో పత్తి రైతు కంట కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం పండించిన పత్తిని అమ్ముకుందామంటే తేమ పేరుతో తిరస్కరించడంతో విధిలేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. తల్లాడ మండలం వివిధ ప్రాంతాల్లోని పత్తి రైతులు.. పత్తిని అమ్ముకోవడానికి సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చినా తేమ పేరుతో తేమ సాకుతో సీసీఐ కొనక పోవడంతో రైతులు పత్తి.. వాహన కిరాయి భారమని భావించి అనివార్యంగా పక్కనే ఉన్న ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అక్కడ వ్యాపారులు రిమోట్‌తో తెలివిగా తూకంలో మోసం చేస్తున్నారు. అనంతరం అదే పత్తిని సీసీఐకి విక్రయిస్తున్నారు. రెండు శాతం కమిషన్ సహా అన్లోడింగ్ చార్జీలు పేరుతో మిల్లులో నిర్వాహకులు ప్రైవేటు వ్యాపారులు దళారులు సిండికేట్‌గా మారి దోపిడీకి పాల్పడుతున్నారు.
ఓ వైపు సీసీఐ మరోవైపు ప్రైవేట్ కొనుగోలు జరుగుతుండటంతో తేమ వంటి సాకుతో ప్రభుత్వ రంగం సంస్థ సీసీఐని తిరస్కరిస్తున్న పత్తిని ప్రైవేటు వ్యాపారులు కొంటున్నారు. ట్రాక్టర్ లేదా ఆటో, డీసీఎం వాహనంలో రైతులు తెచ్చిన పత్తిని సీసీఐ కేంద్రంలో సిబ్బంది తేమ పరీక్ష చేసి తిరస్కరించడంతో ఖర్చు భారంగా భావిస్తున్న రైతులు వేరే చోటకు తరలించలేక అనివార్యంగా పక్కనే ఉన్న ప్రైవేటు వ్యాపారులకు అడిగిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు.
తేమ పేరుతో ధర తగ్గింపు..
కేంద్ర ప్రభుత్వం 8 శాతం తేమ ఉన్న ఏ గ్రేట్ పత్తి క్వింటాలుకు రూ.7521 నిర్ణయించింది. 9 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటే ఒక్కొక్క శాతానికి రూ.75 తక్కువగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధాన్యం మాదిరిగా పత్తి ఆరబెట్టుకునే పరిస్థితి ఉండదు. మార్కెట్‌కు అమ్మకానికి తెస్తే అయితే సీసీఐకి లేదంటే ప్రైవేట్‌గా ఆమ్ముకొని ఇంటికి పోవాల్సిందే. ఒకసారి ఇంటి నుంచి వాహనంలో తెచ్చిన పత్తిని మళ్లీ తీసుకోపోవాలంటే కిరాయి మీద పడి రవాణా ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. దీంతో తేమ పత్తి నల్లగా మారిందనే సాకుతో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.1000 నుంచి రూ.2 వేలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
తూకంలో మోసం..
ప్రైవేట్ మార్కెట్లో పత్తి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. తల్లాడ మండలంలో ఉన్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాల వినియోగంలో వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రిమోట్‌ను జేబులో పెట్టుకొని రైతులకు తెలియకుండా తెలివిగా ఒక్కొక్క తూకంలో ఐదు నుంచి పది కిలోల తక్కువ చూపించి మోసం చేస్తున్నారు. అటు ధరలోను ఇక తోకంలోనూ రైతులకు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. అలాగే కొంతమంది దళారులు వే బ్రిడ్జి కాంటా ద్వారా తూకం చేస్తూ రైతులను పత్తిలో రెండు కిలోలు మూడు కిలోలు తీసి రైతులను మోసం చేస్తూ ప్రైవేట్ వ్యాపారులకు పత్తి తీసుకువచ్చే వాహనాలకు కమిషన్ చూసుకుని రైతులకు ధరను తగ్గిస్తున్నారు.
బస్తాల్లో కాకుండా విడిగా పత్తి తేవాలి.. మొహమ్మద్ అబ్దుల్ అలీం, డీఎంఓ,
కేంద్ర ప్రభుత్వం 8 శాతం నుంచి ఏ గ్రేట్ పత్తి క్వింటాల్ కు రూ.7521 గిట్టుబాటు ధర ప్రకటించింది. తేమ శాతం తక్కువగా ఉండటం, దళారులకు విక్రయించడం ద్వారా రైతులు నష్టపోతున్నారు. సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పత్తిని బస్తాలో అతిగా తొక్కడంతో మ్యాచర్ తక్కువగా వస్తోంది. పత్తిని బస్తాలో కాకుండా విడివిడిగా తీసుకువస్తే ఇప్పుడున్న వాతావరణానికి మ్యాచర్ శాతం వచ్చి, సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోలు జరుపుతాం. రైతులు దళారులకు విక్రయించకుండా ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌లో గాని ఖమ్మం మార్కెట్ యార్డ్‌కు పత్తిని తరలించాలి. రైతులు 8897281111 నెంబర్‌కు హాయ్ అని పంపిస్తే కాటన్ అమ్మకాలు, తక్ పట్టి వివరాలు, చెల్లింపు స్థితి తెలుసుకోవచ్చు.
తేమ శాతం తక్కుగా ఉన్నా కొనాలి.. ఆపతి వెంకట రామారావు, రైతు అన్నారుగూడెం..
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి చేతికి రాగానే సీసీఐ కేంద్రాల వద్దకు తరలించినా తేమ శాతం రాకపోవడంతో దళారులకు విక్రయించి నష్టపోతున్నాం. ఎంతో పెట్టుబడి పెట్టినా తగిన గిట్టుబాటు ధర దక్కడం లేదు. కొంతమంది దళారులు ఊర్లలోకి వచ్చి రిమోట్లతో పత్తి కాంటాను కంట్రోల్ చేస్తూ.. క్వింటాకు 10 కేజీల నుంచి 20 కేజీలు మోసం చేస్తున్నారు. సీసీఐ కేంద్రంలో, మార్కెట్ యార్డులో తగిన గిట్టుబాటు ధర ప్రకటించి, తేమ శాతం తక్కువగా ఉన్నా కొనుగోలు జరపాలని కోరుతున్నాం.