- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Asha workers : ఆడవుల్లో ఆశా వర్కర్ల సాహసం..సర్వత్రా అభినందనలు
దిశ, వెబ్ డెస్క్ : ఆశా వర్కర్లు(Asha workers) వైద్యశాఖ(Medical and Health Department)లో కనీస వేతనానికి నోచుకోని అట్టడుగు చిరుద్యోగులు..అయితేనేం నిత్యం ముఖాముఖిగా ప్రజలకు సేవలందించడంలో వారే అగ్రగణ్యులు. ప్రజలకు వైద్యశాఖ సేవలందించేందుకు క్షేత్ర స్థాయిలో వారు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో ఆశాల విధి నిర్వహణ అత్యంత క్లిష్టతరమే. వర్షాకాలంలో అయితే వాగులు, వంకలు దాటడం వారికి మరింత సమస్యాత్మకం. అయినా తమ విధి నిర్వహణలో రాజీ పడని సేవలందిస్తు పేద జనం పాలిట ఆపన్న హస్తాలుగా నిలుస్తున్నారు. వైద్యులు, ఏఎన్ఎంలు వెళ్లని ప్రాంతాలకు కూడా ఆశా వర్కర్లు సాహసోపేతంగా వెలుతూ ప్రజలకు తమ సేవలందిస్తున్నారు.
అలాంటి సాహసమే పాడేరు ఏజెన్సిలో ఆశా కార్యకర్తలు చేశారు. స్వయంగా నాటు పడవ నడుపుకుంటూ వెళ్లి గిరిజనానికి వైద్య సేవలందించిన వీడియో వైరల్ గా మారింది. ముంచంగిపుట్టు మండలం బకుబెడా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మత్స్య గెడ్డ అవతలి వైపున గ్రామాల గిరిజనులు వాగు దాటి శిబిరానికి రావడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆ గిరిజనుల కోసం సాహసం చేసిన ముగ్గురు ఆశ కార్యకర్తలు స్వయంగా నాటు పడవ నడుపుకుంటూ వెళ్లారు. వారిని శిబిరానికి రావాలని అవగాహన కల్పించారు. ఈ వీడియో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు విధి నిర్వాహణలో ఎదుర్కొంటున్న సవాళ్లకు నిదర్శనంగా నిలిచింది. వీడియో చూసిన నెటిజన్లంతా వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.