Manipur Protest: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. సీఎం ఇంటిని ముట్టడించిన ఆందోళన కారులు

by Rani Yarlagadda |
Manipur Protest: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. సీఎం ఇంటిని ముట్టడించిన ఆందోళన కారులు
X

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్ లో మళ్లీ హింస (Manipur Protests) చెలరేగింది. కిడ్నాప్ చేసిన ఆరుగురిని.. దారుణంగా హతమార్చడంతో.. అక్కడి ఆందోళనలు ఎక్కువయ్యాయి. కుకీ (Kuki) వర్గానికి చెందిన మిలిటెంట్లు మైటీ (meitei) వర్గానికి చెందిన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి, హత్య చేసి.. జిరిబం జిల్లాలోని ఓ నదివద్ద పడేశారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 10 నెలల చిన్నారి కూడా ఉండటం.. ఈ ఘటన అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. ఇంపాల్ లో నిరసనలు వెల్లువెత్తాయి. మహిళలు ఆందోళనకు దిగారు. ఇంపాల్ పోలీస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీయడంతో మణిపూర్ సర్కార్.. రెండ్రోజుల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించింది.

ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల వద్ద కూడా మైతీలు నిరసనలు చేపట్టారు. వారి ఇళ్లను ముట్టడించి, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలో ఉన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సపమ్ రంజన్ (Minister Sapam Ranjan) నివాసంపై ఓ గుంపు దాడిచేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ (Imphal)లో సగోల్ బంద్ లో ఉంటోన్న సీఎం ఎన్ బీరెన్ సింగ్ (CM N Biren Singh) అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నినాదాలు చేశారు. ఆరుగురిని చంపిన నిందితుల్ని 24 గంటల్లోగా అరెస్ట్ చేసి, శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై ఫర్నీచర్లను తగలబెట్టగా ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. పశ్చిమ ఇంఫాల్, బిష్ణాపూర్‌, తౌబల్‌, కక్చింగ్‌, కాంగ్‌పోక్కి, చురాచంద్‌పూర జిల్లాలలో రెండు రోజులు పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో పాటు కర్ఫ్యూ విధించారు.

కాగా.. రాష్ట్రంలో 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో మోహరించిన AFSPA బలగాలను కేంద్రం వెనక్కు తీసుకెళ్లాలని మణిపూర్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Advertisement

Next Story