Pakisthan: ఏడు నెలల గర్భిణిని 25 ముక్కలుగా నరికిన అత్త మామలు.. పాక్‌లో దారుణ ఘటన

by vinod kumar |
Pakisthan: ఏడు నెలల గర్భిణిని 25 ముక్కలుగా నరికిన అత్త మామలు.. పాక్‌లో దారుణ ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌ (Pakisthan)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడు నెలల గర్భిణీ స్త్రీని తన అత్త మామలే 25 ముక్కలుగా నరికారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌ పంజాబ్‌ దస్కాలోని కోట్లి మార్లాన్ గ్రామానికి చెందిన ఖదీర్‌తో గుర్జన్‌వాలా గ్రామానికి చెందిన జెహ్రా(26)కు 2020లో వివాహమైంది. ప్రస్తుతం జెహ్రా గర్భిణీగా ఉండగా కోట్లి మార్లాన్‌లో తన అత్తమామలతో కలిసి నివాసముంటోంది. ఆమె భర్త ఖదీర్ విదేశాల్లో పనిచేస్తున్నాడు. జెహ్రాకు, తన అత్త మామలకు పలు విషయాల్లో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే జెహ్రాపై పగ పెంచుకున్న వారు ఆమెను తాజాగా హత్య చేశారు. మొదట జెహ్రాను దిండుతో చంపేసి ఆ తర్వాత తన శరీరాన్ని 25 ముక్కలుగా నరికారు. అనంతరం శరీర భాగాలను వేర్వేరు బ్యాగుల్లో ప్యాక్ చేసి కాలువల్లో పడేశారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు జెహ్రా ఎవరితోనో పారిపోయినట్టు ప్రచారం చేశారు. అయితే బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. అత్త మామలే కిరాతకానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. విదేశాల్లో పనిచేస్తున్న ఖదీర్‌ను సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story