- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Inhumane Incident: మెడికల్ కాలేజీలో అమానవీయ ఘటన.. విద్యార్థికి గుండు కొట్టించిన ప్రొఫెసర్
దిశ, వెబ్‌డెస్క్ / ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇంచార్జ్ గుండు కొట్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రవేశం లభించింది. దీంతో ఈనెల 12న విద్యార్థి చైనీస్ స్టైల్‌గా కటింగ్ చేయించుకున్నాడు. ఆ కటింగ్ తోటి విద్యార్థులు చూసి హేళన చేశారు. దీంతో విద్యార్థి మళ్లీ అదే కటింగ్ చేయించుకొని వచ్చాడు. మళ్లీ కటింగ్ బాగాలేదని తోటి విద్యార్థులు హేళన చేస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇంచార్జీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెహ్మాన్ విద్యార్థికి అండగా ఉండకుండా విద్యార్థిని వెంట పెట్టుకుని కటింగ్ షాప్‌కు తిసుకువెళ్లి అక్కడే గుండు కొట్టించాడు. మనస్థాపానికి గురైన విద్యార్థి ఈనెల 13న కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో డాక్టర్ రహ్మాన్‌ను కాలేజీ ప్రిన్సిపాల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇంచార్జ్ భాధ్యతల నుంచి తొలగించారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా డీఏంఈకు చెప్పకుండా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరరావు గోప్యంగా ఉంచారు.
ర్యాగింగ్‌పై చర్యలు ఏవి...?
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పాల్పడిన ముగ్గురు విద్యార్థులను, జూనియర్ డాక్టర్‌ను కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. కానీ ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అలాంటి చర్యలు తీసుకోకుండా ప్రిన్సిపల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకూలంగా విద్యార్థుల చేత లేటర్ రాయించిన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కమిటీ వేసి విషయాన్ని కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన మంగళవారం జరిగితే శనివారం అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటివి జరిగినపుడు వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా ఎందుకు కాలాపాన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో ర్యాగింగ్‌ను ఎలా కట్టడి చేస్తారని తోటి విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.