- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుక్కలు బాబోయ్ కుక్కలు.. ఒకే రోజు 42 మందికి గాయాలు..
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలో కుక్కలు ఎప్పుడు ఎటు వైపు నుండి వచ్చి కరుస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డి పేట మండలంలో ఒకే రోజు 42 మందిని ఒకే కుక్క కాటు వేయడంతో ఎల్లారెడ్డి పేటలో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటు బాధితులతో వారి ఆర్తనాదాలతో నిండిపోయింది. మండలంలోని ఓ కుక్క ఎల్లారెడ్డిపేట, రాగట్లపల్లి, నారాయణ పూర్ గ్రామాల్లో రోడ్డు వెంబడి ఎవరు ఉంటే వారిని తీవ్రంగా కరిచింది. అంతే కాకుండా ఎల్లారెడ్డి పేటలో జరిగిన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవానికి వస్తున్న భక్తుల పై దాడి చేయడంతో ఎల్లారెడ్డి పేట, నారాయణపూర్, బండ లింగంపల్లి, గంభీరావుపేట్ మండలం గోరంటాలకు చెందిన వారిని అదే కుక్క స్వైర విహారం చేసి అయిదు నిమిషాల వ్యవధిలో ఎనిమిది మందిని కాటు వేయడంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం క్షతగాత్రులు, వారి బంధువులతో నిండిపోయింది. ఒక్క ఎల్లారెడ్డి పేటలోనే సుమారు 400లకు పైగా కుక్కలు ఉన్నాయని లెక్క తేలినట్లు పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ దిశకు తెలిపారు.
కుక్కల బెడద నివారించాలని వీటి బెడద ఉన్న ప్రతి గ్రామాల్లో జరిగిన గ్రామ సభలో గ్రామ ప్రత్యేకాధికారికి తెలిపిన తీర్మానాలు చేసి చేతులు దులుపుకుంటున్నారని పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. మండలంలోని రాగట్ల పల్లికి చెందిన మనస్విని అనే అమ్మాయిని కుక్క కరవడంతో పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. కుక్కలు ప్రజల పిక్కలు తీసినప్పుడే వాటిని నివారించే విషయం గుర్తుకు వచ్చి ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నివారణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నా అవి బుట్టదాఖలు అవుతున్నాయి. కాగా ఒకే రోజు ఒకే కుక్క 42 మందిని కరవగా ఆ కుక్కను పట్టుకోవడానికి ఎల్లారెడ్డి పేట, రాగట్ల పల్లి నారాయణపూర్ గ్రామాల ప్రత్యేకాధికారులు గ్రామ పంచాయతీ సిబ్బందితో గ్రామానికి ఒక బృందం ఏర్పాటు చేసి పిచ్చి కుక్క కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజూ చిన్న పిల్లలు ఆరు బయట ఆడుకుంటుండగా కుక్కలు దాడులు చేయడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి కుక్కల బెడద నివారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.