- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సంపేటలో డీజిల్ దొంగల హల్‌చల్
దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో చమురు దొంగలు హల్‌చల్ చేశారు. డీజిల్ రేట్లు పెరగడంతో ఇది కూడా లాభసాటి భేరం అనుకున్నారో, జల్సాలకి డబ్బుల కోసం అందింది దోచేద్దాం అనుకున్నారో.. మొత్తానికైతే డీజిల్ ట్యాంకులను పగులగొట్టి చమురు చోరీకి తెగబడ్డారు. ఈ ఘటన నర్సంపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నర్సంపేట పట్టణంలోని త్రివేణి బాలికల కళాశాల ఎదురుగా బీటీ రోడ్‌పై ఆర్టీసీ బస్సులు నిలిపి ఉంచారు. గుర్తుతెలియని దొంగలు డీజిల్ ట్యాంకులను పగులగొట్టి డీజిల్ చోరీకి పాల్పడ్డారు. ట్యాంకులు ఒక్కొక్కటి 200 లీటర్ల సామర్థ్యం ఉండగా, రెండు బస్సుల నుండి మొత్తం 400 లీటర్ల డీజిల్ (సుమారు రూ.40,000/- విలువ) దొంగతనం జరిగినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ రామ్ చరణ్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, పట్టణంలో నడిరోడ్డుపై దొంగతనం జరుగడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.