అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్‌కు అండర్-19 జిల్లా జట్టు ఎంపిక

by Aamani |
అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్‌కు అండర్-19 జిల్లా జట్టు ఎంపిక
X

దిశ, హనుమకొండ టౌన్ : వరంగల్ కేంద్రంగా ఈనెల 26 నుంచి జరగనున్న అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ లో అండర్-19 జిల్లా జట్టు ఎంపిక అయింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొననున్న క్రికెటర్ల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించారు. కె.యం కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ సెలక్షన్లలో, ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 200 పైగా క్రీడాకారులు హాజరు కాగ అత్యుత్తమ బ్యాటింగ్, బౌలింగ్ లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సెలక్షన్ కమిటీ మెంబర్స్ అభినవ వినయ్, మట్టెడ కుమార్, తోట రాము, మెతుకు కుమార్ ల కమిటీ 18 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా అధ్యక్షులు పెద్ది ప్రవీణ్ కుమార్ గౌడ్, సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, మాజీ కార్యదర్శి మార్నేని ఉదయ్ భాను రావు, మాజీ కార్యవర్గ సభ్యులు బండారి ప్రభాకర్ ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed