గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను ఈ ఉత్సవాల్లో ప్రతిబింబిస్తాయి.. తహసీల్దార్ చందా నరేష్

by Sumithra |   ( Updated:2023-06-17 16:03:39.0  )
గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను ఈ ఉత్సవాల్లో ప్రతిబింబిస్తాయి.. తహసీల్దార్ చందా నరేష్
X

దిశ, కొత్తగూడ : గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను ఈ ఉత్సవాలు ప్రతిబింభిస్తాయని తహసీల్దార్ చందా నరేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం సంత్‌ సేవాలాల్‌, కొమరం భీమ్‌ గిరిజన దినోత్సవ కార్యక్రమం మండలంలోని దుర్గరం గ్రామంలో గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి ఆట, పాటలు పాడుతూ లతో నృత్యాలు చేశారు. గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలతో, చిన్నారులు ప్రత్యేక దుస్తులతో ఈ ఉత్సవాలను మండలంలోని దుర్గారం పంచాయతీ కార్యదర్శి మల్లెల కళ్యాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు పరమేష్ మాట్లాడుతూ గిరిజనుల పాలిట మరో సంత్‌ సేవాలాల్‌, కొమరం భీమ్‌గా మారిన కేసీఆర్‌ దేశాధినేత కావాలని దేశ గిరి’జనం’ ఎదురు చూస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలతో సమానంగా గిరిజనులు ఎదగడం కోసం విద్య, ఉద్యోగాలలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను పెంచిందన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధిని కేటాయించినట్లు గుర్తు చేశారు. గిరిజనులకు ప్రత్యేకంగా గిరిజన దినోత్సవం కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మండల అధికారులు పంచాయతీ కార్యదర్శి కళ్యాణిని గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భారతి, ఎంపీవో సత్యనారాయణ, మండల అధికారులు గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed