రిజిస్ట్రేషన్ ధరలు పెంపుపై పునరాలోచనలు చేయాలి..: మాజీ ఎంపీ

by Aamani |
రిజిస్ట్రేషన్ ధరలు పెంపుపై పునరాలోచనలు చేయాలి..: మాజీ ఎంపీ
X

దిశ,జనగామ : బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అరుట్ల దశమంత రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్యాం ప్రకాశ్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీ శ్యాం ప్రకాశ్ ముఖర్జీ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని అన్నారు. భువనగిరి ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 32 శాతం ఓట్లు తెచ్చుకుంది అని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తారని అసత్యప్రచారాలతో ప్రజలను నమ్మించారన్నారు.

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని, హిందువులు హింసా వాదులని, ముస్లింలు,క్రైస్తవులు అహింసా వ్యాధులని రాహుల్ గాంధీ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రైతులకు బోనస్ అని చెవిలో పువ్వులు పెట్టారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే వరకు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచొద్దని ,అలాగే ఎల్ఆర్ఎస్ విషయం లోను సమాలోచనలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనగామ జిల్లా నాయకులు శివరాజ్ యాదవ్, ఉడుగుల రమేష్, పవన్ శర్మ, నియోజకవర్గ ఇన్చార్జిలు , మండల అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed