CM Chandrababu: తిరుమల పవిత్రతను కాపాడుతాం.. మరోసారి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Shiva |
CM Chandrababu: తిరుమల పవిత్రతను కాపాడుతాం.. మరోసారి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) తిరుమల (Tirumala)లో పర్యటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కుటుంబంతో సహా తిరుమలకు చేరుకున్న ఆయన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ఇవాళ ఉదయం వకుళా మాత వంట శాలను కూడా ప్రారంభించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు టీటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల (Tirumala) పవిత్రతను కాపడుతామని భక్తులకు హామీ ఇస్తున్నానని స్పష్టం చేశారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎవరూ డూప్లికేట్ చేయలేకపోయారని అన్నారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. ఆ రుచి రావడం అసాధ్యమని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవారి ప్రసాదాలు, పరిశుభ్రతలో చాలా మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. శ్రీవారిని తలుచుకుని ఏ పని మొదలు పెట్టినా.. విజయవంతం అవుతుందనే నమ్మకం భక్తులతో పాటు తనలోనూ ఉందని తెలిపారు. ఇక నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల (VIP Break Darshan)పై పరిమితిని విధిస్తామని, దేశం నలుమూలల నుంచి వచ్చే సాధారణ భక్తులకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని టీటీడీ అధికారులకు సూచించారు. భక్తుల సూచనల మేరకే చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed