Bigg Boss Telugu 8:  ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఇది ఎవరు ఊహించలేదుగా..!

by Prasanna |   ( Updated:2024-10-05 04:22:24.0  )
Bigg Boss Telugu 8:  ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఇది ఎవరు ఊహించలేదుగా..!
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ఎన్నో కొత్త మార్పులు చేసారు. అయినా కూడా అనుకున్నంత రేటింగ్ రావడం లేదు ఎందుకంటే ఈ సీజన్ లో ఒక్క విష్ణుప్రియ తప్ప మంచి కంటెస్టెంట్స్ ఎవరూ లేరు.

దీంతో ప్రేక్షకులు కూడా ఎక్కువ చూడటం లేదు. అవి చాలవన్నట్టు మిడ్ వీక్ ఎలిమినేషన్, వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ కొత్తవి పెట్టాడు బిగ్ బాస్. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషనే కాకుండా.. ఇప్పుడు వీకెండ్ లో కూడా ఇంకో ఎలిమినేషన్ ఉంటుందని టాక్. జనాల ఓటింగ్ ప్రకారమే కాకుండా ఈ సారి హౌస్ మేట్స్ నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆదిత్య ఓం ను బిగ్‌బాస్‌ ఎలిమినేట్ చేసాడు.

ఆదిత్య ఓం మొత్తం నాలుగున్నర వారాలపాటు హౌస్ లో ఉన్నాడు.ఈ షో కోసం ఆదిత్యకు బిగ్ బాస్ నిర్వాహకులు బాగానే ఆఫర్ చేశారట. వారానికి రూ.3 లక్షల చొప్పున నాలుగున్నర వారాలకుగానూ దాదాపు రూ.14 లక్షలు అందుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story