స్వరాష్ట్రం సాధించినా.. కేసులు మాఫీ కాలేదు: టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్

by Shiva |
స్వరాష్ట్రం సాధించినా.. కేసులు మాఫీ కాలేదు: టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించి పదేళ్లు దాటినా తమపై పెట్టిన కేసులు మాఫీ కాలేదని ఉద్యమకారుడు, టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన సకలజనుల సమ్మెలో ఆర్టీసీ బస్సులను ఆపి ప్రజా రవాణాను అడ్డుకున్నారనే తదితర ఆరోపణలపై ఐపీసీ అండర్ సెక్షన్ 143,341,186,149 సెక్షన్‌లతో టూ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో 28 మంది‌పై కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కోర్టు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. తమతో ఉద్యమాలు చేయించిన గత పాలకులు రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజ భోగాలు అనుభవించారని అన్నారు. సమైక్య పాలకులు పెట్టిన కేసులను మాఫీ చేయకుండా తమను బలి చేశారని విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలుగజేసుకుని తమపై పెట్టిన కేసులను మాఫీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed