గంజాయి స్మగ్లర్ల కలకలం.. సినీ ఫక్కీలో పోలీసుల బైక్‌ను ఢీకొట్టి..

by karthikeya |
గంజాయి స్మగ్లర్ల కలకలం.. సినీ ఫక్కీలో పోలీసుల బైక్‌ను ఢీకొట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఫక్కీలో స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య భారీ ఛేజ్ జరిగింది. స్మగ్లర్లను ఎలాగైనా పట్టుకోవాలని నిందితుల కారును పోలీసులు బైక్‌పై ఛేజ్ చేయగా.. దొరికిపోతామనే భయంతో స్మగ్లర్లు తమ కారుతో పోలీసుల బైక్‌ను ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల బైక్‌ను ఢీకొట్టి పారిపోయిన నిందితులు అనంతరం బీహెచ్‌ఈఎల్ షీలానగర్ వద్ద కారును వదిలి పెట్టి పరారైపోయారు. అనంతరం కారును సీజ్ చేసిన పోలీసులు అందులో లిక్విడ్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే గంజాయి ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? ఎక్కడికి తీసుకెళుతున్నారు..? అనే విషయాలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed