- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గీసుగొండ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవు : భీమగాని సౌజన్య
దిశ,గీసుగొండ: గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవు అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భీమ గాని సౌజన్య అన్నారు. ధర్మారంలో ఫ్లెక్సీల ఏర్పాటు లో జరిగిన వివాదంపై మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ బతుకమ్మ దసరా సందర్భంగా ఫ్లెక్సీలో ఏర్పాటును ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఫోటో కచ్చితంగా ఉండాలని, ఎమ్మెల్యే ఫోటో పెట్టకపోవడం దుశ్చర్య అని ఈ విషయంలో జరిగిన ఘర్షణలో దెబ్బలు తగిలిన కార్యకర్తలు పరామర్శించ కుండా కొట్టిన వారిని విడిపించడానికి మంత్రి కొండా సురేఖ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లడం బాధాకరమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి ఎమ్మెల్యే రేవూరిని గెలిపించుకున్నామని మండల కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు అయ్యాయని ఆనాడు కేసులైన కార్యకర్తలను పట్టించుకోలేదని ఇప్పుడు కావాలనే వర్గాలను లేపుతున్నారని అన్నారు. మండల పార్టీ సీనియర్ నాయకులు వీరగోని రాజ్ కుమార్ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ ప్రతిసారి సొంత మండలం సొంత మండలం అంటూ తమ నాయకుల చెప్పుడు మాటలు విని పార్టీలో వర్గాలను తయారు చేస్తున్నారని,అభివృద్ధి పనుల్లో సొంత మండలం పైన ప్రేమ చూపాలని వర్గ పోరుకు కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వర్గాలుగా విడగొడితే బీఆర్ఎస్ పార్టీ బలపడే అవకాశం ఉంది కాబట్టి పార్టీ పెద్దలు కలగచేసుకుని పరకాల కాంగ్రెస్ పార్టీని ఏకతాటికి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కూసం రమేష్,దూల వెంకన్న, మండల యూత్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్, మాజీ జడ్పీటీసీ ఆంగోతు కవిత,గోనె మల్లారెడ్డి,కొమ్మాల మాజీ ఎంపీటీసీ మణి గోపాల్, వంచనగిరి మాజీ ఎంపీటీసీ రజిత సారంగం,అల్లం మర్రెడ్డి,కేదాసి మోహన్,ధూపాకి సంతోష్, సారన్న, ప్రవీణ్,వజ్ర రాజు, గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.