- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన
దిశ, వెబ్‌డెస్క్: బస్సు ఆలేదని ఓ మహిళ బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే దారిలో చోటు చేసుకుంది. ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించింది. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగగా.. బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును కదిలించాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. బస్సు ఎక్కేవరకు కూడా డ్రైవర్ ఆగడం లేదని ఆ మహిళ ఆగ్రమం వ్యక్తం చేసింది. ఇక ఆర్టీసీ డ్రైవర్లు కూడా మహిళలు ఉన్న చోట బస్సు ఆపడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డ్రైవర్ ఉన్నచోట కాకుండా కొద్ది దూరం వెళ్లాక బస్సును ఆపడంతో మహిళల్లో కొద్దిమంది పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కుతున్నామంటూ సోషల్ మీడియాలో పలువురు మహిళలు డ్రైవర్లపై మండిపడుతున్నారు.