MLA Dhanpal Suryanarayana : అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించొద్దు

by Naveena |
MLA Dhanpal Suryanarayana : అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించొద్దు
X

దిశ ప్రతినిధి,నిజామాబాద్ అక్టోబర్ 30: సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు నాణ్యతా ప్రమాణాలతో, త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ( MLA Dhanpal Suryanarayana)ఆదేశించారు. నగరంలోని 27వ డివిజన్ ఆనంద్ నగర్, 9వ డివిజన్ ఓల్డ్ నాగారం, 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ మున్సిపల్ నగర మేయర్ నీతు కిరణ్ తో కలిసి హాజరయ్యారు. అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..జనరల్ ఫండ్ ద్వారా నగరంలోని ప్రతి డివిజన్ కు రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులో ఎలాంటి నాణ్యత లోపం ఉండకుండా, త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు తగినన్ని నిధులు మంజూరు చేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లికి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకకెళ్లినట్లు ధన్ పాల్ తెలిపారు. నగర అభివృద్ధికి రూ. 100 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తను ఎమ్మెల్యేగా గెలిచి పది నెలలు గడుస్తున్నా.. ఇప్పటికే ఎమ్మెల్యేగా తనకు రావాల్సిన సొంత నిధులు కూడా రాలేదన్నారు. ఆ నిధులను సత్వరమే విడుదల చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, సాయివర్ధన్, బూర్గుల ఇందిర, బీజేపీ నాయకులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed