- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాఠశాల బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
దిశ, తొర్రూరు: ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి కల్వర్టు సమీపంలో చెట్ల పొదల్లోకి దూసుకెళ్లగా చిన్నారులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం లో చోటు చేసుకుంది. మండల కేంద్రంలో ఉన్న ఆర్యభట్ట హై స్కూల్‌లో చదువుతున్న పిల్లలను తీసుకురావడానికి స్కూల్ బస్సు సోమవారం తొర్రూరు నుండి చికటాయపాలెం గ్రామానికి ఉదయం 7 గంటలకు బయలుదేరింది. 7.30 చికటయపాలెం గ్రామం నుండి బయలుదేరి చేర్లపాలెం గ్రామానికి వెళ్తుండగా గ్రామ శివారులో డ్రైవర్ సురేష్ మద్యం మత్తులో బస్సును నడుపగా బస్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొంది.
దీంతో బస్సుకు రైట్‌సైడ్ అద్దం పగిలిపోయింది. బస్సులో సుమారు 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు చెట్టును ఢీకొనడంతో పిల్లలు ఒక్కసారిగా అరుపులు చేస్తూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో చిన్నారులు చిన్న గాయాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల అరుపులు విని అక్కడ ఉన్న స్థానికులు బస్సు వద్దకు చేరుకుని విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. తొర్రూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
పలు సార్లు జరిగిన పట్టించుకోవడం లేదు
ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యానికి డ్రైవర్లు తాగి బస్సు నడుపుతున్నారని పలు సార్లు కంప్లైంట్ చేసిన ఒక్కసారి కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఏ ఒక్క బస్సుకు పిల్లల జాగ్రత్తలు చూసుకోవడానికి క్లీనర్ కూడా లేరు. ఈరోజు జరిగిన ప్రమాదం గురించి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. డ్రైవర్ను యాజమాన్యం లోపల కూర్చోబెట్టి మేపుతున్నారు. వెంటనే మేము 100 డయల్ చేసి పోలీసులను ఆశ్రయించాం. పోలీసులు వచ్చి డ్రైవర్‌ను స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆర్యభట్ట స్కూల్ పై, బస్సులు సరిగ్గా నడిపే విధంగా సూచనలు చేపట్టాలని కోరుతున్నాం.:-కొండ మౌనిక, విద్యార్ధి తల్లి
డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు
ఆర్యభట్ట స్కూల్ బస్సు నడిపే డ్రైవర్ సురేష్ మద్యం మత్తులో ఉన్నాడని నిర్ధారణ అయింది. పిల్లల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.:-కూచిపూడి జగదీష్ ఎస్సై తొర్రూరు