police department : క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పోలీస్ శాఖ...

by Kalyani |
police department : క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పోలీస్ శాఖ...
X

దిశ,జనగామ: జనగామ పోలీస్ స్టేషన్లో బాదితురాలు న్యాయం కోసం న్యాయవాదులు వెళ్లి అడిగినందుకు న్యాయవాద దంపతులు గద్దల అమృత రావు-కవితల పై పోలీసు సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లోనే ఆకరణంగా న్యాయవాదుల పై సీఐ రఘుపతి, ఎస్ ఐ తిరుపతి, పోలీసులు మూకుమ్మడి దాడి చేసిన సంఘటన పై పోలీస్ శాఖ విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరిగింది. జనగామ ఇన్స్ స్పెక్టర్ ఎల్. రఘుపతి రెడ్డి, ఎస్. ఐ పి. తిరుపతి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేయగా, కానిస్టేబుల్ బి. కరుణాకర్ ను ఏ. ఆర్ అటాచ్ చేయడంతో పాటు , సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న దామోదర్ రెడ్డిని జనగామ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ గా బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీఐ గా దామోదర్ రెడ్డిని నియమించారు. న్యాయం గెలిచిందని డీసీపీ రాజమహేంద్ర నాయక్ కు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story