వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

by Sumithra |
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
X

దిశ, ఖానాపూర్ : రైతులకి మద్దతుధరతో పాటు ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అందించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతు శ్రేయస్సు పట్లనిబద్దతతో ఉందని అన్నారు. శనివారం రంగాపురం గ్రామంలో శ్రీ హనుమాన్ రైతు మార్కెటింగ్ పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఓ సంజీవరెడ్డితో పాటు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటల సాగులో ఇతర ప్రాంతాల కంటే వెనుకబడి ఉన్నామని ఇప్పటికే పలుజిల్లాల్లో వరికోతలు పూర్తి అవుతున్నాయని అన్నారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా స్టేట్ షెడ్యూల్ ప్రకారం రైతులు పంటలు వేయాలని మార్చి వరకు కోతలు పూర్తి చేస్తే అకాల వర్షాలకు పంట నష్టపోకుండా ఉంటుందని అన్నారు.

గత రెండు సంవత్సరాలుగా అకాలవర్షాల వలన రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పంటకాలాన్ని పూర్తిచేయాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు, ఇప్పటి వరకు 41,500 ఎకరాల్లో నష్టాన్ని గుర్తించగా, ఖానాపూర్ మండలంలో 6500 ఎకరాల్లో నష్టం జరిగినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా పంటనష్టపోయి ఉందడి, నష్టపరిహార రికార్డుల్లో తమ పేరు లేకపోతే ఆదివారం వరకు సంబంధిత వ్యవసాయ అధికారికి తమవివరాలు అందించాలని అన్నారు. పార్టీలకి అతీతంగా అన్నివర్గాల రైతులు నష్టపరిహారాన్ని పొందాలని సూచించారు. ఇప్పటికే వ్యవసాయంలో యాంత్రీకరణ మొదలైందని, భవిష్యత్తులో యంత్రాల అవసరం బాగా ఉంటుందని రైతు సంఘాలు ముందుకు వచ్చి కోరుకుంటే ప్రభుత్వమే సబ్సిడీ పై యంత్రాలు సమకుర్చుతుందని అన్నారు.

తద్వారా రైతులు లాభసాటిగా వ్యవసాయం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. పంటలతో సంబంధం లేకుండా అన్నిరకాల పంటలకు 10వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్యే పెద్ది కృతజ్ఞతలు తెలిపారు. కొత్తసాలు రోజున ముఖ్యమంత్రి నర్సంపేట నియోజకవర్గంలో అడుగుపెట్టడం పట్లఆనందంగా ఉందని అన్నారు. రైతులు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాలను పొందాలని రైతన్నకు లాభం చేకూర్చే ధ్యేయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, టీఎన్జీఓ నాయకులు జగన్మోహన్ రావు, శ్రీ హనుమాన్ సంఘం అధ్యక్షుడు బందారపు శ్రీను, సర్పంచ్ నరేష్, ఐలయ్య, బూసఅశోక్, ఆర్బీఎస్ కన్వీనర్ వెంకట్ రెడ్డి, గోనె యువరాజు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story