వివాదాస్పదంగా మారిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు

by Aamani |
వివాదాస్పదంగా మారిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు
X

దిశ,దేవరుప్పుల: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం గ్రామ దళిత వాడలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు రోజు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతూ వివాదాస్పదంగా మారుతుంది.దళిత వాడలో గత ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు గద్దె కట్టగా విగ్రహం భారీగా ఉండటంతో ఆ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక బస్ స్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.నాటి నుండి నిర్మించిన గద్దె ఖాళీగా ఉండటంతో గత వారం రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి ఎవరి ప్రమేయం లేకుండా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేశాడు.

ఈ విషయంపై అంబేద్కర్ యువజన కమిటీ సభ్యులు నిలదీసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎంపీడీవో సమక్షంలో చర్చలు జరగగా మెజారిటీ దిశగా విగ్రహం తొలగించాలని తీర్మానం చేశారు. గురువారం అధికారులు ,గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనగా సిబ్బంది వెనుదిరిగి వెళ్లిపోయారు.విషయం తెలిసిన మండల బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున శుక్రవారం గద్దె వద్దకు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహన్ని తొలగించవద్దని నినాదాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు జనగామ సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోకో చేయాగ భారీగా ట్రాఫిక్ అంతరాయం కలుగగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు వాగ్వాదం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టిఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Next Story

Most Viewed