అతనితో పీకల్లోతు ప్రేమలో స్మృతి మంధాన.. ఐదేళ్లుగా రిలేషన్‌‌షిప్‌లో

by Harish |
అతనితో పీకల్లోతు ప్రేమలో స్మృతి మంధాన.. ఐదేళ్లుగా రిలేషన్‌‌షిప్‌లో
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఎప్పటి నుంచో రూమర్లు ఉన్నా ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఈ జంట తమ బంధాన్ని ధ్రువీకరించింది. ఈ లవ్ బర్డ్స్ తాజాగా ఐదేళ్ల రిలేషన్‌షిప్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇద్దరూ కేక్ కట్ చేశారు. ఆ ఫోటోలను పలాశ్ ముచ్చల్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వారి ప్రేమాయణం బహిర్గతమైంది. ఆ ఫోటోలకు స్మృతి మంధాన కూడా స్పందించింది. హార్ట్ సింబల్ పోస్టు చేసింది. ఈ జంటకు నెటిజన్లతోపాటు సెలబ్రిటీలూ శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు, మరికొందరు ‘సృతి మంధాన మా హృదయాలను ముక్కలు చేశావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆటతో, అందంతో కుర్రాళ్లను కట్టిపడేసే స్మృతి మంధానకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కోసం మైదానాలకు వచ్చే వారు ఉన్నారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది.

ఎవరీ పలాశ్ ముచ్చల్

మధ్యప్రదేశ్‌కు చెందిన పలాశ్ ముచ్చల్ ఒక మ్యూజిక్ కంపోజర్. పలు ఆల్బమ్స్ చేశాడు. పలాశ్ ఫిల్మ్ మేకర్ కూడా. అతని దర్శకత్వంలో వెబ్ సిరీస్ రిక్షా, అర్ధ్, కామ్ చాలు హై మూవీలు వచ్చాయి. స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ 2019 నుంచి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. స్మృతి మ్యాచ్‌లకు కూడా అతను హాజరయ్యే వాడు. ఆమెతో ఉన్న ఫొటోలను పలాశ్ తరుచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటాడు. వీటికి స్మృతి కూడా రిప్లే ఇస్తుంటుంది. అయితే, వీరు తమ రిలేషన్‌షిప్‌ గురించి ఎప్పడూ ఓపెన్ అవ్వలేదు. తాజాగా ఐదేళ్ల జర్నీ సెలబ్రేషన్‌తో తమ బంధాన్ని బయటపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed