- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jupally Krishna Rao : దుబాయ్ లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు
దిశ, కొల్లాపూర్ : మన విశిష్ఠ సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అని,ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి, సాంప్రదాయలను మరవొద్దని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రెండు రోజుల దుబాయ్ పర్యాటనలో భాగంగా పర్యాటక అభివృద్ధి, ప్రమోషన్ వంటి అంశాలపై ఓ హోటల్ లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబాయ్ పర్యాటక శాఖ అధికారి జాసిం మొహమద్ అల్ అవాదీ, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తో కలిస పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను మంత్రి జూపల్లి కృష్ణారావు అడిగి తెలుసుకున్నారు.మన రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో దుబాయ్ లో అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ...నేటి శాస్త్ర, సాంకేతిక యుగంలో మన సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలు ద్వంసం కావడం వల్ల సమాజంలో చాలా రుగ్మతలకు దారితీస్తుందని, వాటి విలువను బావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.మన సంపదను పదిమంది మంచికి ఉపయోగించాలని సూచించారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతాయని,బతుకమ్మ పండుగ మహిళ శక్తిని చాటుతుందని,తెలంగాణ ఉద్యమాన్ని సంఘటిత శక్తిగా మార్చడంలో బతుకమ్మ వేడుకలు ప్రత్యేక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.