- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Unrealistic life: ఊహాల్లో తేలుతూ..‘అన్ రియలిస్టిక్ లైఫ్ స్టాండర్స్’తో నష్టపోతున్న యూత్
దిశ, ఫీచర్స్ : భవిష్యత్తులో బాగు పడాలంటే ముందు వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలని నిపుణులు అంటుంటారు. అయితే ఆధునిక యువత ఇలాంటివి పెద్దగా పట్టించుకోవడం లేదని కూడా చెప్తున్నారు. వయస్సు ప్రభావమో, హార్మోన్లలో మార్పులో, అప్పటి సామాజిక పోకడలో కానీ యువతలో వాస్తవానికి భిన్నమైన ఆలోచనలను కూడా ప్రేరేపిస్తుంటాయని చెప్తున్నారు. అయితే ఈ ‘అన్ రియలిస్టిక్ లైఫ్ స్టాండర్స్’ నిజ జీవితంలో ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ సినిమా చూస్తున్నప్పుడో, నలుగురు గుమిగూడి మాట్లాడుకుంటున్నప్పుడో ‘గుడ్ లుకింగ్ కపుల్స్’ అని ఎవరైనా అన్నారనుకోండి. సాధారణంగా ఎవరైనా ఏం ఊహించుకుంటారు? ఆ జంట చూడ్డానికి బాగుందనో, అన్యోన్య దంపతులనో మనసులో అనుకుంటారు. కానీ న్యూ జనరేషన్‌లో చాలా మంది అందుకు భిన్నంగా ఊహించుకుంటున్నారు. ముఖ్యంగా 20 ఏండ్లలోపు యువతీ యువకులైతే ‘గుడ్ లుకింగ్’ అనగానే వారి సాధారణ రూపానికి బదులు, వారి బాడీ ఇమేజింగ్, శరీరాకృతులు, ఫ్లేవ్‌లెస్ స్కిన్, వారి మధ్య రొమాన్స్ వంటి విషయాలను ఊహించుకొని మురిసిపోతారు. యవ్వనప్రాయంలో ఇలాంటి ఊహలు సహజమే అయినా.. ‘అన్ రియలిస్టిక్ థాట్స్’ అధికమైతే రుగ్మతగా మారవచ్చునని నిపుణులు అంటున్నారు.
ఏం ఊహించుకుంటారు?
అన్ రియలిస్టిక్ లైఫ్ స్టాండర్స్(Unrealistic life స్టాండర్డ్స్) లేదా థాట్స్ అనేవి ఓన్లీ ‘గుడ్ లుకింగ్’ ఊహలకే పరిమితం కావు. అమ్మాయిలైతే అబ్బాయిల గురించి, అబ్బాయిలైతే అమ్మాయిల గురించి ఆలోచిస్తూ ఒక విధమైన ఊహాజనిత ప్రపంచంలో తేలిపోతుంటారని నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవానికి దూరంగా ఉంటాయని, జీవితంలో సాధ్యం కానివిగానూ ఉండవచ్చునని చెప్తున్నారు. ఇలా యవ్వన దశలో మాత్రమే కాదు, ఆ దశ దాటిన స్త్రీ, పురుషులు కూడా లవ్, రొమాన్స్, లైఫ్ వంటి విషయాల్లో, జీవితంలోని అనేక సందర్భాల్లో ‘అన్ రియలిస్టిక్ థాట్స్’లో మునిగి తేలుతుంటారనడంలో సందేహం లేదు.
ఆలోచనలు ఎలా వస్తాయి?
ఊహల్లో తేలియాడే ‘అవాస్తవికి జీవన ప్రమాణాలు’ యువత ఈ సమాజం నుంచే గ్రహిస్తుంది. బయటి పరిస్థితులు, ఆధునిక పోకడలు, మానవ సంబంధాలు, శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం, వ్యక్తుల అనుభవాలు వంటివి అందుకు దోహద పడుతుంటాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా సినిమాలు, ఓటీటీల్లో చూస్తున్న రొమాంటికల్ సిరీస్‌లు, అశ్లీల చిత్రాలు యువతలో ‘గుడ్ లుకింగ్’ ఇమాజినేషన్స్ సెట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రిలేషన్‌షిప్ అండ్ పర్సనల్ స్కిల్స్ కౌన్సెలింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
సంబంధాలపై ప్రభావం
యువతీ యువకులు సెలబ్రిటీలను, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో హీరో హీరోయిన్లను ఊహించుకుంటూ ‘అన్ రియలిస్టిక్ లైఫ్ స్టాండర్స్’ను ఫీల్ అవుతుంటారు. అచ్చం అలాంటి రొమాంటిక్ ఆదర్శాలను, శారీరక అందాలను కలిగి ఉండాలని భావిస్తారు. ఈ క్రమంలో అతి ఆలోచనలు ఒత్తిడికి గురిచేయడంవల్ల వాస్తవిక జీవన ప్రమాణాల గురించి తెలుసుకునే ప్రయత్నాలను యువతరం విస్మరిస్తోందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా నిజ జీవితం, వైవాహిక బంధం తాము ఊహించుకున్నట్లు లేకపోవడంవల్ల నిరాశకు గురవుతుంది. ఇది రిలేషన్ షిప్‌లో, రొమాంటిక్ లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో గొడవలకు, విడాకులకు, ఇంకా అనేక సమస్యలకు దారితీస్తుంది.
కారణం అదేనా?
లవ్, రొమాన్స్, పెళ్లి వంటి విషయాల్లో సరైన అవగాహన లేకపోవడం కూడా యువతలో అవాస్తవిక జీనవ ప్రమాణాలపై అతి అంచనాలు, ఊహలకు మరొక కారణంగా ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ విషయాలు ఎక్కడా చర్చకు రావు. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులతో కుటుంబ సభ్యులు, పేరెంట్స్ వీటిని ప్రస్తావించే అవకాశం తక్కువ. అలాగే రియల్ లైప్ స్టాండర్స్ గురించి సినిమాలు, సిరీస్‌లలో కూడా తక్కువే చూపిస్తారు. దీంతో సినిమాలు, సిరీస్‌లలో ఉండే అన్ రియలిస్టిక్ లవ్, రొమాన్స్, లైఫ్ వాస్తవ జీవితంలో కూడా ఉంటాయని భ్రమపడే యువతీ యువకులు చాలా మందే ఉంటారు. ఆరోగ్యం, నిరాశ, వర్క్ ప్రెజర్, ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్ వంటి విషయాల్లో వాస్తవాలు, బాధ్యతలు, ప్రాధాన్యతలకు బదులు అవాస్తవిక ఆలోచనలు, తాము ఊహించుకున్న విధంగా లేకపోవడం వంటివి సమస్యలకు దారితీస్తాయి.
ఊహలు.. నిజ జీవితం
ప్రేమ, పెళ్లి, జీవితం, రొమాన్స్ వంటి అనేక విషయాల్లో తాము ఎలా ఉండాలో ఊహించుకోవడం తప్ప అందులో వాస్తవం ఉందా? కలిసి జీవించే క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వంటి అవగాహన లేకపోవడం యువతలో ‘అన్ రియలిస్టిక్ లైఫ్ స్టాండర్స్’కు ప్రధాన కారణంగా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. అవగాహన, సామాజిక స్పృహ ఉన్నప్పుడో, పెద్దలు, వ్యవస్థలు కలిగించినప్పుడో అలాంటి ఊహాలకు తక్కువ అవకాశం ఉంటుంది. అవసరమైనప్పుడు సర్దుకుపోవడం, సంతోషంగా జీవించడం, సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవడం వంటివి యువతీ యువకులు నేర్చుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఇమాజినేషన్‌లో కూరుకుపోవడం కుటుంబ కలహాలకు, ఇతరుల జోక్యాలకు కారణం అవుతాయి. అందుకే ఊహలు వేరు.. వాస్తవాలు వేరు. మానసిక ఆనందానికి, మనిషి మనుగడకు ఊహలు అవసరమే కావచ్చు. వాస్తవాలను విస్మరించేంత స్థాయిలో ఉండకూడదని నిపుణులు అంటున్నారు.