- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రచారం హోరాహోరీ..
X
దిశ, కరీమాబాద్ : మసీదుల వద్ద అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎదురెదురు పడడంతో ఇరుపక్షాలు మసీదు ముందు హోరాహోరీ నినాదాలు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. వరంగల్ మండిబజార్ లోని మసీదులో శుక్రవారం సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి కొండా సురేఖ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో, వెంటనే మసీదు వద్దకు చేరుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ నరేందర్ ను బయటికి తీసుకువచ్చారు. ఇంతలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండా సురేఖ కాంగ్రెస్ కరపత్రాలతో మసీదు ముందు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కచోటకి చేరడంతో పోటాపోటీ నినాదాలతో మసీదు వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను పక్కకు జరిపారు.
Advertisement
Next Story