- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ హై కోర్టులో ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు..
దిశ, ఏటూరునాగారం : ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ కిందకే వస్తాయని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆదివాసీల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తన వాదనలు వినిపించారు. ఆదివాసీ, ఆదివాసియేతరులు వేసిన పిటిషన్ పై ఇవాళ సీజే ఉజ్జల్ భుయాన్ తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును ఏకీభవించింది. ఆ తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది.
ఈ మేరకు ఆదివాసీ యేతరులు వేసిన అప్పీల్ పిటిషన్ కొట్టేసింది. ఐదో షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనులకు రాజ్యాంగం ప్రత్యేకమైన అధికారాలను కల్పించింది. ముఖ్యంగా భూమి మీద పూర్తిగా హక్కు లభిస్తుంది. ఆ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాల తవ్వకానికి గిరిజనులకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, ప్రభుత్వం సైతం గిరిజనేతరుడిగానే పరిగణింపబడుతుందని కేసులో సుప్రీం వెల్లడించింది. దీంతో ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివాసీలు సంబరాలు జరుపుకుంటున్నారు. గత 25 సంవత్సరాల నుండి ఎలక్షన్ జరగక అభివృద్ధి కుంటుపడిందని, వెంటనే ఎలక్షన్ లు నిర్వహించాలని ఆదివాసీలు కోరారు.