- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులతో వంటపనులు.. బలపం పట్టే చేతులతో కత్తులు పట్టించి..
దిశ, కంగ్టి : తెలంగాణలో విద్యా రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. గురుకుల పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ అంటూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోంది. వీటితో పాటు కేజీ టూ పీజీ విద్యాలయాల రూపకల్పన కూడా జరుగుతోంది. మన ఊరు మన బడి పేరుతో అన్ని మౌలిక సదుపాయాలతో పక్కా పాఠశాల భవనాలు నిర్మిస్తూ ముందుకు పోతోంది. ఇదంతా సర్కార్ చెప్తోన్న మాటలు. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో దానికి భిన్నంగా పరిస్థితులున్నాయి. అందుకు నిదర్శనమే.. కంగ్టి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ స్కూల్. ఈ పాఠశాలలో విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకోవటం మాత్రమే కాదు.. వంట పనులు చేసే కార్యక్రమాలు కూడా చేయాల్సిందే. ఇది ఆ స్కూల్ హెడ్ మాస్టర్ హుకూం మరీ..! చదువులు కోసం పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తుంటే.. చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పిల్లలకు కత్తిపీటలు ఇచ్చి కూరగాయాలను కోయిస్తున్న ఘటన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.
బలపం పట్టే చేతులు కత్తులు పడుతున్నాయ్
మధ్యాహ్న భోజన నిర్వాహకులు తరగతి గదుల్లో ఉన్న పిల్లలను పిలిపించి, వారి వారితోనే కూరగాయలు తెప్పించడం, వంట కాలు తయారు చేసే క్రమంలో భాగంగా కూరగాయాలు కోస్తూ కనిపించారు. వంట మనుషులు ఉన్నా కూడా విద్యార్థుల చేత ఇటువంటి పనులు చేయించడం ఏమిటని పలువురు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. స్కూళ్లలో చిన్నచిన్న పిల్లలతోనూ పనులు చేపిస్తున్నారు ఉపాధ్యాయులు. స్కూళ్లలో అదనపు తరగతులు, వంట గదుల నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో.. విద్యార్థులకు పని చెబుతున్నారు.
ఎంపీడీవో ముందే విద్యార్థులు పనులు
బాలబాలికల్ని ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. అయితే కంగ్టి జడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించేందుకు ఎంపీడీవో ఆకస్మికంగా పాఠశాలను సందర్శించారు. ఏకంగా ఎంపీడీవో కళ్లముందే విద్యార్థులే మధ్యాహ్న భోజన వంటకాలు చేస్తూండడం గమనార్హం. ఎంపీడీవో సైతం విద్యార్థులతో పనులు చేయించడమేంటని అడగకపోవడం, చూసీచూడనట్లు వెళ్ళారు. వంట మనుషులు ఎందుకు..వారికి జీతాలు ఎందుకు అని విద్యార్థులు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.