తాళ్లపూసపల్లి-ఇంటికన్నె రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి

by Sridhar Babu |
తాళ్లపూసపల్లి-ఇంటికన్నె రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి
X

దిశ, కేసముద్రం : మహబూబాబాద్ జిల్లాలోని తాళ్ల పూసపల్లి - ఇంటికన్నె స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తయ్యాయి. భారీ వర్షాలు, వరదలకు ట్రాక్ పూర్తిగా ధ్వంసంకాగా, రైళ్లన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన రైల్వేశాఖ అధికారులు, సిబ్బంది వరదకు కొట్టుకుపోయిన ట్రాక్ ను పునరుద్దరించేందుకు రాత్రింబవళ్లు శ్రమించారు. తాళ్లపూసపల్లి 432 కిలోమీటర్ వద్ద, వందలాది మంది మూడు రోజులపాటు కష్టపడి మరమ్మతు చేశారు.

అత్యంత వేగంగా ట్రాక్ పనులు పూర్తిచేసి కార్మికులు, అధికారులు రికార్డు సృష్టించారు. ఈ క్రమంలోనే బుధవారం ట్రాక్ పై అధికారులు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. కేసముద్రంలో ఆగివున్న సంఘమిత్ర ఎక్స్​ప్రెస్ ను వరంగల్ వైపు పంపించారు. దీంతో విజయవాడ - కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. కార్మికుల శ్రమను ప్రజలు అభినందిస్తున్నారు.

Advertisement

Next Story