- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్
డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం డోర్నకల్ సీటుపై మాత్రం డెసిషన్‌ను పెండింగ్‌లో పెట్టింది. అభ్యర్థిత్వానికి ప్రధానంగా ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. రామచంద్రునాయక్, నెహ్రూనాయక్, భూపాల్‌నాయక్ మధ్య టికెట్ పోరు కొనసాగుతోంది. సర్వే బేస్డ్ అంశంతోపాటు కీలక నేతల సహకారం, అసమ్మతి నేతల ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఇప్పటికే అభ్యర్థిని ఎంపిక చేసినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. టికెట్ రేసులో ఉన్న నెహ్రూనాయక్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 31న కాంగ్రెస్ జాబితా వెలువడుతుందని, డోర్నకల్ అభ్యర్థిగా నెహ్రూనాయక్ పేరు వెలువడనున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం ప్రకటన కోసం శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
దిశ, వరంగల్ బ్యూరో/ మరిపెడ : డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం డోర్నకల్ సీటుపై మాత్రం డెసిషన్‌ను పెండింగ్‌లో పెట్టింది. అభ్యర్థిత్వానికి ప్రధానంగా ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. రామచంద్రునాయక్, నెహ్రూనాయక్, భూపాల్‌నాయక్ మధ్య టికెట్ పోరు కొనసాగుతోంది. సర్వే బేస్డ్ అంశంతోపాటు కీలక నేతల సహకారం, అసమ్మతి నేతల ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఇప్పటికే అభ్యర్థిని ఎంపిక చేసినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. టికెట్ రేసులో ఉన్న నెహ్రూనాయక్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 31న కాంగ్రెస్ జాబితా వెలువడుతుందని, డోర్నకల్ అభ్యర్థిగా నెహ్రూనాయక్ పేరు వెలువడనున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం ప్రకటన కోసం శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
పార్టీకి వేవ్ ఉండడంతోనే ఆసక్తి..!
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వేవ్ అంశంతో ఈ సారి డోర్నకల్‌లోనూ పార్టీ గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నేతలు విశ్లేషణ చేస్తున్నారు. డోర్నకల్ రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఎదిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్‌ను ఈసారి ఎలాగైనా ఓడించాలనే గట్టి పట్టుదలతో కాంగ్రెస్ ముఖ్య నేతల్లో కనిపిస్తుండడం గమనార్హం. ఇందుకోసం ఖమ్మం మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి వంటి దిగ్గజాలకు ఈ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందన్న చర్చా సాగుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నేతలను ఇప్పటికే రెడ్యా స్వయంగా కలుస్తూ కలుపుకుపోయే ప్రయత్నం మొదలు పెట్టడం విశేషం. ఈ నేపథ్యంలో డోర్నకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలకపోయినా.. రాజకీయం మాత్రం చాలా రసకందాయంగా ఉండనుందని సీనియర్ పొలిటికల్ లీడర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జాప్యంతో చేజారే అవకాశం ఉందని ఆందోళన..!
అభ్యర్థిత్వం విషయంలో జాప్యంపై శ్రేణుల్లో కొంత ఆందోళన, నైరాశ్యం కనిపిస్తోంది. త్వరగా అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ప్రచారంతో జనంలోకి వెళ్తే అనుకూల పరిస్థితులు నెలకొంటాయని, లేదంటే మళ్లీ ఎప్పటిలాగే చేజార్చుకోవాల్సిన పరిస్థితికి అవకాశం ఉందన్న ఆందోళనను శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆదివారం అధిష్టాన పెద్దలు, ఆశావాహ అభ్యర్థులైన రామచంద్రునాయక్, నెహ్రూనాయక్, భూపాల్ నాయక్‌లతో వేర్వేరుగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ముగ్గురిలో ఏ ఒక్కరికి టికెట్ కేటాయింపు జరిగినా మిగతా ఇద్దరికి పార్టీ అధికారంలోకి వచ్చాకా నామినేటెడ్ పదవులతో పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా రెండు రోజుల్లోపు డోర్నకల్ అభ్యర్థిత్వం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. టికెట్ రాని అభ్యర్థులు అసమ్మతి రాగం ఎత్తుకుంటారో..? లేక కలిసి పనిచేస్తారో..? వేచి చూడాలి.