- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రారంభమైన ‘ హౌజ్ లిస్టింగ్ ’ సర్వే
దిశ, మంగపేట : ఈ నెల 6 నుండి 19 వరకు ప్రభుత్వం నిర్వహించే ‘సమగ్ర కుటుంబ సర్వే’ కు సంబంధించి నవంబర్ 1 నుంచి 6 వరకు మండలంలోని 25 పంచాయతీలు, ఆవాసాల్లో హౌస్ లిస్టింగ్ సర్వే చేపట్టినట్లు ఎంపీడీఓ భద్రు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్యూమరేటర్లతో కలిసి ఇంటింటి గుర్తింపు సర్వేలో ఎంపీడీఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఎన్యూమరేటర్ కు కేటాయించిన 1 నుండి 150 ఇళ్లను సందర్శించి,ఆయా ఇంటి యజమానులకు సర్వేకు సంబందించిన 75 రకాల పత్రాల పరిచయం, లోకేషన్ ను గుర్తించి 6 నుంచి 19 వరకు జరిగే సర్వేకు ముందస్తుగా సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. మండలంలోని 25 పంచాయతీల్లో నేటి నుంచి 6 వరకు జరిగే సర్వేలో 119 మంది ఎన్యూమరేటర్లు, 38 మంది రిజర్వ్ ఎన్యూమరేటర్లు, 10 మంది సూపర్ వైజర్లు, 5 గురు రిజర్వ్ సూపర్ వైజర్లను నియమించినట్లు తెలిపారు.