దిశ ఎఫెక్ట్‌ : శ్రీ‌శ్రీ‌నివాస్ క్లినిక్ సీజ్‌..

by Sumithra |
దిశ ఎఫెక్ట్‌ : శ్రీ‌శ్రీ‌నివాస్ క్లినిక్ సీజ్‌..
X

దిశ, ఏటూరునాగారం : ఇంజ‌క్ష‌న్ స‌రిగా వేయ‌క‌పోవ‌డంతో న‌డ‌వ‌లేక పోతున్న బాలుడు అనే క‌థ‌నాన్ని గురువారం దిశ పత్రికలో ప్ర‌చురించిన విషయం తెలిసిందే. అయితే ఈ కథనానికి జిల్లాక‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య స్పందించి దృష్టి సారించారు.

ఈ మేర‌కు శుక్ర‌వారం రోజున జిల్లా పీవో ఎన్‌సీడీ అదికారి మంకిడి వెంక‌టేశ్వ‌ర్లు బాదితుడు ప్ర‌వీణ్ విష‌య‌మై విచార‌ణ చేప‌ట్టాల‌ని అదేశాలు జారీ చేశారు. కాగా పీవో ఎన్‌సీడీ అధికారి మంకిడి వెంక‌టేశ్వ‌ర్లు శుక్ర‌వారం రోజున ద‌ర్మ‌ారం గ్రామంలోని శ్రీ‌శ్రీ‌నివాస క్లినిక్‌లో త‌నీఖీలు నిర్వ‌హించి, బాదిత బాలుడు ప్ర‌వీణ్ త‌ల్లీ తండ్రుల‌తో మాట్ల‌డి పూర్తి స‌మాచారం తెలుసుకున్నారు. అనంత‌రం ఆర్ఏంపీ ప్రైవైట్ ఆసుప‌త్రి శ్రీశ్రీ‌నివాస క్లినిక్‌ను సీజ్ చేశారు.

Advertisement

Next Story