- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: మేడారం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం
by Disha News Web Desk |
X
దిశ, ములుగు: మేడారం మహా జాతరకు వెళ్లి వస్తుండగా జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో భారీగా భక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదాలు ములుగు జిల్లాలో గురువారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ వద్ద మేడారం వెళ్లి వస్తున్న భక్తుల టాటా మ్యాజిక్ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడినవారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతేగాక, ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా మేడారం భక్తులు వస్తున్న ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన భక్తులందరికీ చికిత్స జరుగుతోంది.
Advertisement
Next Story