ప్రభుత్వం వారితో కుమ్మకైంది.. టీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్

by Disha News Desk |
ప్రభుత్వం వారితో కుమ్మకైంది.. టీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్
X

దిశ, ములుగు: సోమవారం ములుగు జిల్లాలోని భూపాల్ నగర్ (పంది కుంట) గ్రామములో ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మిర్చి పంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాల వలన తెగులు సోకి మిర్చి పంట దెబ్బ తిందన్నారు. లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు నేడు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తెలిపింది. రైతులకు భరోసా కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని పేర్కొంది. పంట నష్టాలతో రైతులు చనిపోతుంటే టీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారని మండిపడింది. వరి పంట పండిస్తే సకాలంలో కొనకుండా, తరుగు పేరుతో క్వింటాకు 10 నుండి 12 కిలోల కోత విధిస్తూ మిలర్లతో ప్రభుత్వం కుమ్మకైందని ఆరోపించారు. రైతులను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి.. ఇది రైతు ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం, రైతుల రక్తం తాగే ప్రభుత్వం అని అన్నారు. వెంటనే వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసింది.



Advertisement

Next Story