ఎంజీఎం ఆస్పత్రిలో సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ సెంటర్

by Aamani |
ఎంజీఎం ఆస్పత్రిలో సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ సెంటర్
X

దిశ, వరంగల్ : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా, వరంగల్ బస్టాండ్ సమీపంలోని ఎస్ఎన్ఎం జంక్షన్ వద్ద బల్దియా స్మార్ట్ సిటీ నిధులు రూ.60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన జంక్షన్ అభివృద్ధి పనులు, ఎంజీఎం ఆస్పత్రిలో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో రూ.41లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సింగిల్ డోనార్ ప్లేట్లెట్ సెంటర్ ను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు ఆసుపత్రిలోని పలు విభాగాలైన అవుట్ పేషంట్, ఆరోగ్య శ్రీ వర్డ్, క్యాజువాలిటీ విభాగాలకు సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడి వైదులు అందిస్తున్న వైద్యం పట్ల ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు.

వంటశాలను సందర్శించి రోగుల కొరకు తయారు చేస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎస్డీపీ మిషన్ ఏర్పాటు ప్రాణాంతకరమైన డెంగ్యూ వ్యాధి వల్ల రక్తంలో ప్లేట్లెట్ల చికిత్స కొరకు సామాన్య ప్రజలు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సింగిల్ డోనార్ ప్లేట్లెట్ సేకరించేందుకు ప్రైవేట్ ఆసుపత్రిలో 12 వేల రూపాయలు చేయాల్సి ఉంటుందని, కానీ ఎంజీఎం ఆసుపత్రిలో ఉచితంగా ఈ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో గల పీఎంఎస్ఎస్.వై ఆసుపత్రిలో 14 పడకలకు అప్గ్రేడ్ చేసి పీఎంఎస్ఎస్ వై లో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ ను మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ ప్రారంభించారు. అదనంగా 10 డయాలసిస్ పడకల యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ మెడికల్ కళాశాలలో రూ.3 కోట్ల 45లక్షల వ్యయంతో నిర్మించే అంతర్గత రోడ్ల పనులను మంత్రులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో పిల్లల తల్లిదండ్రులతో కల్పిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మునిసిపల్ కమీషనర్ డాక్టర్ అశ్విని తానాజి వాకాడే, కార్పోరేటర్ వేముల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, ఎంజీఎం సూపరింటెండెంట్ మురళి, ఆర్ఎంఓ లు మురళి, శ్రీనివాస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed