వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..

by Aamani |
వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..
X

దిశ,నెక్కొండ: వాయుగుండం కారణంగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది.వేములవాడ - భద్రాచలం వైపు వెళ్లే ఆర్టీసీ బస్ నెక్కొండ మండలంలోని వెంకటాపురం గ్రామంలోని వాగు వద్ద శనివారం రాత్రి వరదలో చిక్కుకుంది.బస్ లో సుమారు నలభై అయిదు మంది ప్రజలు 12 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు.సమాచారం అందుకున్న వరంగల్ కలెక్టర్ సత్య శారద దేవి,తహసీల్దార్ రాజు కుమార్,ఎస్సై మహేందర్, సీఐ చంద్రమోహన్ ప్రయాణికులను ఓ లారీలో ఒడ్డుకు తరలించారు.ప్రయాణికులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు తరలించి,అక్కడినుండి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సురక్షితంగా ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed